Pattabhiram: పేదల ఇళ్ల నిర్మాణంలో జగన్‌వి ప్రగల్భాలే.. పీఎంజీఏవై కింద 459 ఇళ్లు మాత్రమే పూర్తి: టీడీపీ నేత పట్టాభిరామ్ - నేటి వార్తలు
🎬 Watch Now: Feature Video
పేదల ఇళ్ల నిర్మాణంలో జగన్ రెడ్డి ప్రగల్భాలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు ఎక్కడా పొంతన లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకాలకింద అర్భాటంగా ప్రారంభించిన ఇళ్లపథకాన్ని జగన్ రెడ్డి పునాదులకే పరిమితం చేశాడని మండిపడ్డారు. 5ఏళ్లలో 30లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ హామీ ఇచ్చాడని పట్టాభిరామ్ గుర్తు చేశాడు. జగన్ రెడ్డి తొలిదశలో భాగంగా గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో పేదల కోసం ప్రారంభించిన ఇళ్లు 18,63,603 మాత్రమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటికీ దాదాపు 75శాతం ఇళ్లు పునాదుల దశ కూడా దాటలేదని జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయని పట్టాభి దుయ్యబట్టారు.
అర్బన్ ప్రాంతాల్లో 16 లక్షల 84543 ఇళ్లకుగాను కేవలం 45శాతం ఇళ్లకు ఇంకా పునాదులు పడలేదని పట్టాభిరామ్ పేర్కొన్నాడు. కేవలం పునాదులు వడిన ఇళ్ల 20.35 శాతం పలుగు సైతం పడని ఇళ్లు 5.52శాతం ఉన్నట్లు వివరించారు. ప్రధానమంత్రి గ్రామీణ్ అవాస్ యోజన కింద 1 లక్ష79060 వేయిల ఇళ్లకు గాను ఇళ్ల కేవలం 459 ఇళ్లు మాత్రమే గ్రామీణ ప్రాంతంలో ఇళ్లను పూర్తి చేసినట్లు పట్టాభి పేర్కొన్నాడు. ఇళ్లపేరిట జగన్ పేదలను మోసం చేస్తున్నాడని పట్టాభిరామ్ ఆరోపించాడు.