Patriotic Songs Director: అమర వీరుల త్యాగాల స్ఫూర్తితోనే 'జయీభవ'... దేశభక్తి గీతాలతో.. పవన్ చైతన్యపథం - patriotic songs director Pasupuleti Pawan
🎬 Watch Now: Feature Video
Patriotic Songs Director: చిన్నతనంలో అందరూ తోటి స్నేహితులు ఆటలతో కాలక్షేపం చేస్తే.. ఆ యువకుడు మాత్రం సరిగమలతో సావాసం చేశాడు. రాత్రి, పగలు తేడా లేకుండా రాగాలు సాధన చేశాడు. ఆకట్టుకునే బాణీలకు, ఆలోచింప చేసే సాహిత్యం జత చేసేవాడు. అలా సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, రచయితగా రాణిస్తున్నాడు బాపట్లకు చెందిన యువ సంగీత దర్శకుడు పసుపులేటి పవన్. ఇటీవల కాలంలో అందరూ ప్రేమ, జానపద గీతాల వైపే మొగ్గు చూపుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పాటలే ఎక్కువగా కన్పిస్తుంటాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంతా ఇలాంటి ట్రెండింగ్ పాటలకే ఎట్రాక్ట్ అవుతున్నారు. అయితే అందుకు భిన్నంగా.. దేశం కోసం ప్రాణాలర్పించే సైనికులపై దేశభక్తి పాటలను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఈ యువ సంగీత దర్శకుడు. ఈ నేపథ్యంలో ఆ యువ కళాకారుడి పాటల ప్రయాణం ఎలా సాగుతుందో అతడి మాటల్లోనే విని తెలుసుకుందాం పదండి.