Paralysis Suffering Police Officer Duty in CM Jagan Meeting సీఎం సభ.. పక్షవాతం వచ్చినా డ్యూటీ చేయాల్సిందే! కన్నీరుపెట్టిస్తున్న ఓ పోలీస్ వీడియో.. - సీఎం జగన్ మీటింగ్‌లో ప్రజల సమస్యలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 19, 2023, 7:15 PM IST
Paralysis Suffering Police Officer in CM Jagan Meeting: నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జరిగిన సీఎం జగన్ బహిరంగ సభలో మరోసారి ప్రజలకు తిప్పలు తప్పలేదు. అదే విధంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ను చూసి ప్రజలు తీవ్రంగా చలించిపోతున్నారు. పెరాలసిస్(పక్షవాతం( వచ్చి.. కాలు, చేయి పనిచేయక సరిగ్గా నడవలేని స్థితిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. అన్నమయ్య జిల్లా గాలివీడు పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ రమణ పెరాలసిస్‌తో బాధపడుతున్నారు. సరిగ్గా నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే సీఎం సభకు విధులలో వేయడంతో.. తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత కష్టంగా వచ్చారు. సభకు వచ్చిన ప్రజలు.. ఆ పోలీస్‌ను చూసి తీవ్రంగా బాధపడుతున్నారు. దీనిపై విమర్శలు సైతం చేస్తున్నారు.
Protest at CM Jagan Public Meeting: వైసీపీ వీరాభిమాని నిరసన: మరోవైపు బహిరంగ సభలో వైసీపీ వీరాభిమాని నిరసన తెలిపారు. ప్యాపిలి మండలం వెంగళాంపల్లికి చెందిన తాను జగనన్న ఇల్లు కట్టుకుంటే.. ఇంత వరకు బిల్లులు ఇవ్వలేదని వాపోయారు. అదే విధంగా ఎప్పటిలాగానే సీఎం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే.. మహిళలు వెనుదిరిగారు. పోలీసులు వారిని అడ్డుకోవాలనిచూసినా ప్రయోజనం లేకుండా పోయింది.