YSRCP district president resigned: "సమస్యలు తీర్చలేనపుడు పదవి ఎందుకు"... విశాఖ వైఎస్సార్సీపీ నేత రాజీనామా - విశాఖ
🎬 Watch Now: Feature Video
YSRCP Visakha district president resigned: వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేశారు. పదవితో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమక్షంలో వెల్లడించి.. రాజీనామా పత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. ఏడాది కాలంగా ఎన్నో సమస్యలు సీఎం దృష్టి కి తీసుకుని వైళ్లాలని ప్రయత్నించినా చెప్పడానికి వీలు కాలేదని ఈ సందర్భంగా రమేశ్ బాబు ఆవేదన చెందారు. ప్రజా సమస్యలు, కింది స్థాయిలో సమస్యలను తీర్చ లేనప్పుడు ఈ పదవిలో ఉండటం, పార్టీలో కొనసాగడం సమంజసం కాదని రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అధ్యక్షుడు అంటే స్వేచ్ఛాయుత పరిస్థితులు ఇవ్వలేదని ఆవేదన చెందారు. చాలా వరకు విమర్శించే మనస్తత్వం తనకు లేదని పేర్కొన్నారు. సామాజిక వర్గ మీటింగులు పెట్టొద్దని పార్టీ ఆదేశించిందని చెప్పారు. ఏ నియోజక వర్గం వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే కు అనుకూలంగా సుబ్బారెడ్డి గారు మాట్లాడతారని అన్నారు. అలాగని తనకు, సుబ్బారెడ్డితో ఏ విభేదం లేదని రమేశ్ బాబు స్పష్టం చేశారు. నాలుగు రోజుల్లో మరో సారి మాట్లాడతానని చెప్పారు.