పాడేరు ఘాట్‌రోడ్డులో సబ్ కాంట్రాక్టర్ మృతిని ఛేదించిన పోలీసులు
🎬 Watch Now: Feature Video
Paderu Ghat Road Death Mystery : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో సబ్ కాంట్రాక్టర్ శ్రీధర్ మృతికి గల కారణాలను పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 5న శ్రీధర్ తన మిత్రుడు ఆదిబాబుతో కలిసి పాడేరులో పనులు ముగించుకుని తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో తిరిగి వెళ్తుండగా ఆకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శ్రీధర్ నుదుటిపై గాయం అయ్యి రహదారి పక్కన పడిపోయాడు. తన స్నేహితుడికి ఏం జరిగిందో అర్థం కాక ఆదిబాబు బోరున విలపించారు.
ఆదిబాబు స్థానికుల సహాయంతో శ్రీధర్‌ను ఆసుపత్రికి తరలించారు. అతన్ని వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. శ్రీధర్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. శ్రీధర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో నుదుటిపై బుల్లెట్ గాయమైనట్లు వైద్యులు గుర్తించారు. పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. పాడేరు మండలం జోడూరి గ్రామానికి చెందిన సుబ్బారావు అనే వ్యక్తి నాటు తుపాకీతో కోతులను వేటాడుతుండగా గురి తప్పి అటుగా వెళ్తున్న శ్రీధర్‌కు తగిలి మృతి చెందాడని ఎస్పీ ధీరజ్ వెల్లడించారు.