లక్ష రూపాయలు బకాయి - అద్దె చెల్లించలేదని సచివాలయానికి యజమాని తాళం - అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం వేసిన యజమాని
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2023, 8:57 PM IST
Owner Locked to Sachivalayam in Anantapur District: అద్దె చెల్లించలేదని గ్రామ సచివాలయానికి భవన యజమాని తాళం వేసిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామ సచివాలయాన్ని అద్దె భవనంలోనే నిర్వహిస్తున్నారు. అయితే ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ తనకు కొంత మొత్తం మాత్రమే అద్దె చెల్లించారని, ఇంచా చాలా చెల్లించాలంటూ యజమాని వాపోయాడు. దీంతో చేసేదేమీ లేక భవనానికి యజమాని తాళం వేశాడు.
ఎర్రగుడి గ్రామానికి చెందిన రాజేష్ సచివాలయానికి భవనాన్ని అద్దెకు ఇవ్వగా, సచివాలయాలు ప్రారంభం మొదలు నుంచి ఇప్పటి వరకు రూ. 30 వేలు మాత్రమే అద్దె చెల్లించారని పేర్కొన్నాడు. ఇంకా చెల్లించాల్సినది లక్ష రూపాయలకు పైనే ఉంటుందని యాజమాని రాజేష్ అవేదన వ్యక్తం చేశారు. మొత్తం అద్దె చెల్లించిన తర్వాత సచివాలయాన్ని తెరవాలని లేకుంటే వద్దు అని, అంత వరకు తాళం వేసినట్లు తెలిపాడు. వెంటనే సచివాలయ అద్దె చెల్లించాలని వాపోయారు.