Sitara birthday: సి'తార' దిగివచ్చిన వేళ..! మహేశ్‌బాబు కూతురు సితార పుట్టిన రోజున ఏం చేసిందో తెలుసా..! - Burripalem
🎬 Watch Now: Feature Video
Sitara birthday: సూపర్ స్టార్ కూతురు.. తనను చూసేందుకే ప్రతి ఒక్కరూ ఎదురు చూసే తరుణంలో.. తన నుంచే ఆహ్వానం అందితే..! అది కూడా తన పుట్టిన రోజు వేడుకైతే..! ఆ వేడుకలో మనకే తిరిగి బహుమతులు అందితే..! ఆ బహుమతి మన దైనందిన అవసరాలను తీరిస్తే..! ఇంకా అంతకు మించి ఎవరేం కోరుకుంటారు చెప్పండి. సరిగ్గా ఇదే మధుర జ్ఞాపకం మిగిలింది.. తెనాలి మండలం బుర్రిపాలెం విద్యార్థులకు. ఆ విశేషాలేమిటో తెలుసా..
సూపర్ స్టార్ మహేష్ బాబు - నమ్రతల కూతురు సితార పుట్టినరోజు ఈ నెల 19వ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అపురూప కానుక అందింది. ఇక్కడ 8నుంచి 10వ తరగతి చదువుతున్న 40మంది విద్యార్థినులకు సితార తన పుట్టినరోజు సందర్భంగా సైకిళ్లు అందజేసింది. మహేష్ బాబు ఆహ్వానం మేరకు బుర్రిపాలెం నుంచి విద్యార్థినుల్ని ప్రత్యేకంగా హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థినుల మధ్య సితార పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తన పుట్టినరోజును సితార ఇలా ప్రత్యేకంగా జరుపుకొంది. అమ్మాయిలతో కలిసి కేక్ కట్ చేసి ప్రేమతో వాళ్లందరికీ స్వయంగా తినిపించింది. అనంతరం వాళ్లతో సరదాగా ముచ్చటించింది. విద్యార్థినులు దీనిపై సంతోషం వ్యక్తం చేశారు.