అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడంపై ఆగ్రహం - పోలీసులు, సచివాలయ సిబ్బందిపై మండిపడుతున్న యజమానులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 17, 2023, 9:55 PM IST

Officials Forced to Open Anganwadi Centers : గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలను పోలీసుల సహాయంతో సచివాలయ సిబ్బంది బలవంతంగా తెరిచారు. మంగళగిరి మండలంలో ఉన్న సుమారు 50 అంగన్వాడీ కేంద్రాలను పోలీసుల సహాయంతో బలవంతంగా తెరిపిచడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సచివాలయ సిబ్బంది తీరుపై అంగన్వాడీ కేంద్రాల భవన యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తాళాలు పగలగొడితే కేసు పెడతామని హెచ్చరించారు. తాళాలు పగులగొట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చూపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు మరోసారి అద్దెకి ఇవ్వకుండా ప్రభుత్వం తమకు గట్టి గుణపాఠం చెప్పిందని వాపోయారు.  

మంగళగిరిలోని కొప్పురావు కాలనీలోని అంగన్వాడీ కేంద్రం తాళాలు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా ఇంటి యజమాని అడ్డుకున్నారు. అయినప్పుటికి బలవంతంగా తాళం తీసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరువుని మధ్య వాగ్వాదం జరిగింది. అంగన్వాడీ కార్యకర్తలకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. బలవంతంగా కేంద్రాలు తెరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బలవంతంగా తెరచిన అంగన్వాడీ కేంద్రాలలో సామాగ్రిని తనిఖీ చేసిన సచివాలయ సిబ్బంది మళ్లీ తాళాలు వేసి వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.