NRIs agitation against CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ఎన్ఆర్ఐల ఆగ్రహం.. టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు.. - టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 23, 2023, 4:55 PM IST
NRIs agitation against CBN Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఎక్కడిక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు ఆయురారోగ్యాలతో జైలు నుంచి వెంటనే విడుదల కావాలని ఆకాంక్షిస్తూ.. ఆలయాల్లో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలు, రిలే దీక్షలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల నుంచి చంద్రబాబు అరెస్టుపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబును జైలు నుంచి విడుదల చేసేంత వరకు ఆందోళనలు విరమించేదే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టాంజానియా దేశంలో ప్రవాసాంధ్రులు నిరసన తెలిపారు. రాజధాని దార్ ఎస్ సలాంలో తెలుగువారు క్యాండిల్ ర్యాలీ చేశారు. రాజకీయ కక్షతోనే చంద్రబాబును అక్రమంగా ఇరికించారని ఎన్ఆర్ఐలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 'వియ్ స్టాండ్ విత్ బాబు' అంటూ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు.