శ్మశాన వాటికకు దారి లేక అవస్థలు పడుతున్న ప్రజలు - ap social problem
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-12-2023/640-480-20393119-thumbnail-16x9-burial-ground.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 30, 2023, 7:57 PM IST
No Way to Burial Ground in Konaseema District : మనిషి జీవించడానికిి ఇళ్లు ఉన్నట్లే చనిపోయిన తరువాత ఖననం చేయడానికి ఏ ఊరికైనా శ్మశాన వాటిక ఉండాలి. కోనసీమ జిల్లాలో ఓ గ్రామానికి శ్మశాన వాటిక ఉంది కానీ అందుకు దారి మాత్రం లేదు. జిల్లాలోని పోలవరం మండలం జి. మూలపొలం గ్రాామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూలపొలం గ్రామంలో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేయాలంటే పంట పొలాల్లో నుంచి అతి కష్టంగా శ్మశాన వాటికకు తీసుకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు వాపోతున్నారు.
Troubled People : గ్రామ శ్మశాన వాటికకు రహదారి కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం దారి మంజూరు చేస్తున్నామని చెప్పి, తరువాత దాని గురించి కూడా ఆలోచన చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా రహదారి వేసి గ్రామ ప్రజలకు ఊరట కలిగించాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.