No Salaries to Teachers: 'మొదటి తేదీన కాకుండా.. ఉన్నప్పుడు జీతం ఇస్తామనే ధోరణి సరికాదు'
🎬 Watch Now: Feature Video
No Salaries to Teachers from Last Three Months: బదిలీ అయిన 30 వేల మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం 3 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మూకల అప్పారావు మండిపడ్డారు. ఇదేమని ఉపాధ్యాయులు అడుగుతుంటే సి.ఎఫ్.ఎమ్.ఎస్‌లో సాంకేతిక కారణాలు అని చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం వచ్చినా కూడా ఇంకా దాదాపు 2 లక్షల 5 వేల మంది ఉపాధ్యాయులకు అగష్టు నెల జీతం చెల్లించలేదన్నారు. అసలు జీతం వస్తుందో రాదోనన్న అనుమానం కలుగుతుందన్నారు. జీతాల చెల్లింపునకు అర్భన్ ఎంఈవోలకు ఖజానా శాఖ కార్యాలయం నుంచి అనుమతులు రాలేదని అంటున్నారని వాపోయారు.
Salary Delayed for Teachers in Andhra Pradesh: జీతం మెుదటి తేదీన కాకుండా ఉన్నప్పుడు ఇస్తామనే ధోరణిలో ప్రభుత్వం ఆలోచన చేయడం అన్యాయమన్నారు. ఉపాధ్యాయులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బ్యాంకు రుణాలు చెల్లించలేక, ఇంట్లో కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేని స్థితిలో ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం సాంకేతిక కారణాలను చూపకుండా ఉపాధ్యాయులకు జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.