ఎట్టకేలకు రాష్ట్ర మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్‌కు స్వగ్రామంలో ఓటు - ఏపీ ఓటరు జాబితా వార్త
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 10:41 AM IST
Nimmagadda Ramesh Kumar got Vote in His Village: రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎట్టకేలకు తన స్వగ్రామంలో ఓటు హక్కును దక్కించుకున్నారు. గతంలో ఆయన ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా తిరస్కరణకు గురైంది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటు హక్కు కల్పించాలంటూ తొలుత ఆయన.. స్థానికంగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే స్థానికంగా ఉండడం లేదంటూ అధికారులు దరఖాస్తును తిరస్కరించారు. దీంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. లోపభూయిష్ట విచారణ కారణంగా తాను 2020లో దుగ్గిరాలలో ఓటు హక్కు పొందలేకపోయానని నివేదించారు. న్యాయస్థానం ఆదేశాలతో మళ్లీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెండు నెలల క్రితం ఇంటింటా ఓటర్ల జాబితా పరిశీలనలో భాగంగా తన ఇంటికి వచ్చిన బీఎల్వో వద్ద.. ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. స్థానికంగానే ఉంటున్నట్లు ధ్రువపత్రాలను అధికారులకు అందించారు. పరిశీలన అనంతరం తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఓటు హక్కు కల్పించారు.