Annaprasada Distribution Program: "టీటీడీ స్థానిక ఆలయాల్లో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు యోచిస్తున్నాం" - రాత్రి వేళ అన్నప్రసాద వితరణ
🎬 Watch Now: Feature Video
Night Time Annaprasada Distribution Program in Tiruchanuru: తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాల్లో నిరంతరాయంగా అన్నప్రసాద వితరణకు యోచిస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గల అన్నప్రసాద భవనంలో రాత్రి వేళ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అన్నప్రసాద భవనంలో స్వామి, అమ్మవార్ల చిత్రపటాలకు పూజలు నిర్వహించిన అనంతరం ఛైర్మన్ స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు రోజుకు రెండు పూటలా కలిపి దాదాపు ఒక లక్షా 30 వేల మందికి రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఎక్కువమంది భక్తులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి వస్తున్నారని.. తోళప్ప గార్డెన్స్‌లోని అన్నప్రసాద భవనంలో రోజుకు సుమారుగా 5 వేల నుంచి 6వేల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీరిస్తున్నారన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు అన్నప్రసాదాలు అందిస్తున్నారని.. ఇక నుంచి సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు అదనంగా అన్నప్రసాదాలు అందించే ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో తిరుచానూరు అమ్మవారి పుష్కరిణి మరమ్మతులతో పాటు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఛైర్మన్ తెలిపారు.