విజయవాడ వించిపేటలో నైట్​ ఫుడ్ కోర్ట్ - ఎంఐఎం నేతల ఆందోళన - MIM Protest Against Vinchipeta Food Court

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 23, 2023, 7:35 PM IST

Night Food Court at Vinchipeta in Vijayawada : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ పాతబస్తీ వించిపేట ముసాఫిర్ ఖానా సమీపంలో మున్సిపల్ కార్పొరేషన్ నైట్ ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేయడానికి నిర్మాణాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో వించిపేట ఎంఐఎం నాయకులు మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు విజయవాడ పాత బస్తీకి చెందిన ఎంఐఎం నాయకులు షేక్ షమీర్ ఆధ్వర్యంలో ఫుడ్ కోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రాంతంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

MIM Protest Against Vinchipeta Food Court : స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రోద్భలంతోనే అత్యంత రద్దీగా ఉండే, సమస్యాత్మకమైన ప్రాంతమైన వించిపేట కూడలిలో అర్ధరాత్రి వరకు ఫుడ్ కోర్ట్ నిర్వహిస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని వారు తెలిపారు. అంతేకాక ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో చిన్నపాటి దుకాణాలు, హోటళ్లు నిర్వహిస్తున్న చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం కలుగుతుందని, ధనార్జనే ధ్యేయంగా ఈ ప్రాంత వైసీపీ నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నాయకులు సమీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.