Kolagatla Veerabhadra Swamy: స్విమ్మింగ్ పూల్లో తేలుతూ.. ఏపీ డిప్యూటీ స్పీకర్ జలాసనాలు - విజయనగరంలో స్విమ్మింగ్ పూల్ డే సెలబ్రేషన్స్
🎬 Watch Now: Feature Video
Kolagatla Veerabhadra Swamy Yoga in Swimming Pool: జాతీయ స్విమ్మింగ్ పూల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్సులో.. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి జలాసనాలు ప్రదర్శించారు. కార్యక్రమాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించంగా.. స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి గంట పాటు నీటిపై తేలియాడుతూ.. జలాసనం వేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు నగరప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. గంటపాటు నీటిపై తేలియాడుతూ జలప్రదర్శన నిర్వహించిన కోలగట్లను.. స్పీకర్ తమ్మినేని, మంత్రి బొత్స సత్యనారాయణ అభినందించారు. నేటి యువత టీవీలు, సెల్ ఫోన్, సోషియల్ మీడియా మాయలో పడి.. ఆరోగ్యం ప్రాముఖ్యతను విస్మరిస్తోందని కోలగట్ల అన్నారు. సోషల్ మీడియా దుష్ప్రభావాలను క్రీడలపై.. ముఖ్యంగా పిల్లలపై పడకుండా జాగ్రత్త వహించాలనే సందేశంతోనే 64 సంవత్సరాల వయస్సులో తాను ఈ ప్రదర్శన చేపట్టానని తెలిపారు. పిల్లల్లో క్రీడలపై ఆసక్తి పెంచి తగిన ప్రోత్సాహం అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేది.. స్విమ్మింగ్ క్రీడ అని.. దాని ఆవశ్యకతను అందరూ తెలుసుకోవాలని సూచించారు. జల క్రీడలకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు.