పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు - ప్రవీణ్ ప్రకాష్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 4:36 PM IST
National ST Commission Notices to Pravin Prakash: ఎస్టీ ఉద్యోగినిని వేధించిన వ్యవహారంలో జాతీయ ఎస్టీ కమిషన్ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు నోటీసులు జారీ చేసింది. 2024 జనవరి 2వ తేదీన దిల్లీలోని ఎస్టీ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని ప్రవీణ్ ప్రకాష్‌ను ఆదేశించింది.
ఇదీ జరిగింది: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అర్లి గ్రామానికి చెందిన పాలకొండ నిర్మల అనే కాంట్రాక్టు ఉద్యోగిని ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. పాఠశాల సందర్శన సమయంలో తరగతి గదిలో తనను వేధించి, ఉద్యోగ విషయంలో ప్రవీణ్ ప్రకాష్ ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించి ప్రవీణ్ ప్రకాష్(Education Principal Secretary Praveen Prakash)కు ఈ మేరకు నోటీసులు పంపింది. వేధింపుల ఫిర్యాదుపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్(National ST Commission) ప్రవీణ్ ప్రకాష్‌ను ఆదేశించింది. జిల్లాల పర్యటనలకు ప్రవీణ్ ప్రకాష్ వస్తున్నారంటే అధికారులు హడలిపోయేవారనే ప్రచారాలు సాగేవి. ఇలాంటి సమయంలో మహిళ ఫిర్యాదుతో ఆయనకు నోటీసులు జారీ చేయటం చర్చనీయాంశమైంది.