విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు జారీ - School Education Dept Principal Secretary news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 5:57 PM IST

National ST Commission Notice Issued to Praveen Prakash: రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు.. జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఒప్పంద మహిళా ఉద్యోగిని వేధింపులకు గురి చేశారని కమిషన్‌కు అందిన ఫిర్యాదు మేరకు.. ఆయనకు (ప్రవీణ్ ప్రకాష్‌) జాతీయ ఎస్టీ కమిషన్ శనివారం నోటీసు ఇచ్చింది. మహిళ ఫిర్యాదుపై వారంలోగా వివరణ ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులో ఆదేశించింది. 

Female Employee Complaint on Praveen Prakash: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌.. తనను వేధింపులకు గురి చేశారంటూ.. శ్రీకాకుళం జిల్లా సారవకోటకు చెందిన ఒప్పంద మహిళా ఉద్యోగిని పి.నిర్మల ప్రవీణ్‌ ప్రకాష్‌పై ఇటీవలే ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన ఎస్టీ కమిషన్.. ఆయనకు నోటీసు జారీ చేసింది. అనంతరం వారంలోగా కమిషన్‌కు జారీ చేసిన నోటీసులో పేర్కొన్న అంశాలకు వివరణ ఇవ్వాలని.. ప్రవీణ్ ప్రకాష్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.