Nata Convention 2023: రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి.. ప్రవాసాంధ్రులను కోరిన సీఎం జగన్ - AP CM Jagan Speech at NATA Mahasabhalu
🎬 Watch Now: Feature Video
CM JAGAN SPEECH AT TELUGU NATA MAHASABHALU: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) ఆధ్వర్యంలో జూన్ 30వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు అమెరికాలోని డాలస్ నగరంలో నాటా మహాసభలు అట్టహాసంగా జరిగాయి. ఈ మహాసభల్లో తెలుగు సంప్రదాయాలను, కళలను అపూర్వమైన స్థాయిలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాటా తెలుగు మహా సభలనుద్దేశించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఓ సందేశం ఇచ్చారు. రాష్ట్రానికి ప్రవాసాంధ్రుల సహాయ, సహకారాలు ఎంతో అవసరమని, రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోగపడాలని కోరారు.
రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రులు కలసి రావాలి.. అమెరికాలోని డాలస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన సందేశాన్ని ప్రదర్శించారు. ఆ సందేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ''అమెరికాలోని డాలస్ నగరంలో గత మూడు రోజులుగా నాటా తెలుగు మహా సభలు జరగడం తెలుగువారందరికీ ఎంతో గర్వకారణం. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి ప్రవాసాంధ్రులు కలసి రావాలి. రాష్ట్రానికి ప్రవాసాంధ్రుల సహాయ, సహకారాలు ఎంతో అవసరం. రాష్ట్రానికి ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోగపడాలని కోరుతున్నాను. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడు సంవత్సరాల నుంచి దేశంలోనే మొదటి స్ధానంలో ఆంధ్ర రాష్ట్రమే కనిపిస్తోంది. సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లోనూ రాష్ట్రం టాప్ 4,5 స్ధానాల్లో కనిపిస్తోంది. సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం. వివిధ రంగాల్లో ప్రవాసాంధ్రులకు ఉన్న అనుభవాన్ని రాష్ట్రం, గ్రామాల అభివృద్ది కోసం వినియోగించాలని కోరుతున్నాను. రాబోయే రోజుల్లో మీ అనుభవాలతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని వేటుకుంటున్నా. నాటా తెలుగు మహాసభల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని జగన్ అన్నారు.