నేటితో ముగియనున్న లోకేశ్ యువగళం పాదయాత్ర - 20న విజయోత్సవ సభ - యువగళం విజయోత్సవ సభ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 18, 2023, 12:45 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra in Visakha: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ యువగళం పాదయాత్ర 226వ రోజు ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్​ వెంట తల్లి భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు కదం కలిపారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సాగనుంది. మధ్యాహ్నం అగ్రిగోల్డ్ బాధితులు, మీసేవా నిర్వాహకులతో లోకేశ్​ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన అనంతరం కూర్మన్నపాలెం జంక్షన్‌ వద్ద స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో​ భేటీ కానున్నారు. లోకేశ్​ యువగళం పాదయాత్ర నేటితో ముగియనుంది.

విశాఖ శివాజీనగర్‌లో పాదయాత్ర ముగింపు సందర్బంగా లోకేశ్​ పైలాన్ ఆవిష్కరించనున్నారు. యువగళం పాదయాత్ర కుప్పంలో ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైంది. మెుత్తం 97 నియోజకవర్గాల్లో 226 రోజులపాటు పాదయాత్ర కొనసాగింది. యువగళం పాదయాత్రలో భాగంగా 3,132 కిలోమీటర్ల మేర లోకేశ్​ నడిచారు. అన్ని జిల్లాల్లో ప్రజలు యువగళం పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. ఎల్లుండి విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభ(Yuvagalam Vijayotsava Sabha) నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.