Nara Lokesh Yuvagalam Padayatra: చంద్రబాబు నీళ్లు పారిస్తానంటే.. జగన్ రక్తం పారిస్తున్నాడు: లోకేశ్ - Yuvagalam Padayatra
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-08-2023/640-480-19207809-178-19207809-1691426613867.jpg)
Nara Lokesh Yuvagalam Padayatra: యువగళం పాదయాత్రలో భాగంగా పల్నాడు జిల్లా కారంపూడిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభకు భారీగా టీడీపీ అభిమానులు, స్థానికులు తరలివచ్చారు. దీంతో కారంపూడి వీర్లగుడి ప్రాంతం జనసంద్రంగా మారింది. మాచర్ల నియోజకవర్గం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. పల్నాడు పౌరుషానికి పురిటిగడ్డ కారంపూడి అని లోకేశ్ కొనియాడారు. మాచర్లను అభివృద్ధి చేస్తారని నాలుగు సార్లు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి గెలిపిస్తే.. ఆయన అభివృద్ధిని గాలికివదిలేసి అరాచకాన్ని పెంచారని.. నారా లోకేశ్ మండిపడ్డారు. మాచర్లలో గ్రానైట్ లారీలు, మద్యం విక్రయం, ఇసుకు దందాతో పిన్నెల్లి అన్నదమ్ములు కోట్లు గడించారని ధ్వజమెత్తారు. మాచర్లలో గుట్కా, మట్కా, పేకాట ముఠాలను నడిపిస్తున్నారని లోకేశ్ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసిన చంద్రబాబు నీళ్లు పారిస్తామంటే.. జగన్ రక్తం పారిస్తామంటున్నారని.. లోకేశ్ మండిపడ్డారు. దిశా చట్టం పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.