లోకేశ్ యువగళం పాదయాత్రకు మద్దతుగా 3 వేల ఆటోలతో ర్యాలీ - లోకేశ్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 10, 2023, 4:55 PM IST
Nara Lokesh Yuvagalam Padayatra completed 3000 Kms: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు, గుంటూరులో 3 వేల ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని మహ్మతా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని శిల్పారామం నుంచి అమరావతి రోడ్డు వరకు తెలుగుదేశం నేత మన్నవ మోహనకృష్ణ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ర్యాలీలో పాల్గొన్నారు. నారా లోకేశ్ పాదయాత్ర తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకుల్లో పునరుత్తేజాన్ని నింపిందని తెలిపారు.
లోకేశ్ పాదయాత్రకు యువత, మహిళలు, వృద్ధులతో అన్నివర్గాల ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుందని మన్నవ మోహనకృష్ణ పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభంజనానికి అధికార వైసీపీ నేతల గుండెల్లో వణుకు పుడుతుందని ఆయన విమర్శించారు. అరాచక వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని మన్నవ తెలిపారు. లోకేశ్ పాదయాత్రకు వైసీపీ అనేక అడ్డంకులు సృష్టించిందనిస, వైసీపీ అడ్డుంకులను దాటుకొని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు వింటూ లోకేశ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీయే అధికారంలోకి వస్తుందని మన్నవ మోహనకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.