మంగళగిరిలో లోకేశ్ పర్యటన - యువనేతకు ఆత్మీయ స్వాగతం - దాదాపు 11 నెలల తర్వాత మంగళగిరిలో లోకేశ్ పర్యటన
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 27, 2023, 12:24 PM IST
|Updated : Dec 27, 2023, 1:04 PM IST
Nara Lokesh Visits Mangalagiri Constituency: రాష్ట్రంలో దాదాపు 11 నెలల తర్వాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలో పర్యటించారు. యువగళం పాదయాత్ర అనంతరం నియోజకవర్గంలో మొదటిసారి పర్యటించడంతో ప్రజలు యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలపై ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయతో భేటీ అయ్యారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కోసం చేపట్టాల్సి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
అనంతరం పద్మశాలీ సేవా సంఘం అధ్యక్షుడు కనకయ్యను కలిసి యోగక్షేమాలపై నారా లోకేశ్ ఆరాతీశారు. ధర్మవరం, వెంకటగిరి ప్రాంతాల్లో పద్మశాలీలు పడుతున్న ఇబ్బందులను తన పాదయాత్రలో నేరుగా చూశానన్నారు. అనంతరం ప్రముఖ వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి షేక్ సాదియా అల్మాస్ కు అభినందనలు తెలియజేశారు. చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని లోకేశ్ భరోసా కల్పించారు.