Nara Lokesh Interaction With Kshatriya Community: వైసీపీ పాలనలో క్షత్రియులూ బాధితులే.. వారి పోరాటానికి టీడీపీ మద్దతు : లోకేశ్ - పాదయాత్ర వీడియోలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2023, 8:03 PM IST
Nara Lokesh Interaction With Kshatriya Community: పౌరుషం, దాన గుణానికి మారుపేరుగా నిలిచే క్షత్రియులు కలసికట్టుగా వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ సర్కార్ వచ్చాక అదే పనిగా క్షత్రియులను వేధిస్తోందని మండిపడ్డారు. యవగళం పాదయాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా వెంపలో క్షత్రియ సామాజికవర్గంతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేశ్.. వైసీపీ అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు.
వైసీపీ ప్రభుత్వంలో క్షత్రియులు సైతం బాధితులుగా మారారని లోకేశ్ ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే మెుదట మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు చేశారని గుర్తుచేశారు. స్వంత ప్రభుత్వంలోని అక్రమాలను ప్రశ్నించినందుకు.. రఘురామకృష్ణ రాజుపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. క్షత్రియుల పోరాటానికి తెలుగుదేశం అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. 2024లో అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. క్షత్రియులు అన్ని రంగాల్లో ఉన్నారని.. వైసీపీ ప్రభుత్వం క్షత్రియులను ఇబ్బందులు పెడుతోందని నారా లోకేశ్ మండిపడ్డారు.