ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్​గా మారింది - మున్సిపల్, ఆశ వర్కర్లకు టీడీపీ మద్దతు : నారా లోకేశ్ - నారా లోకేష్ వార్తలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 12:48 PM IST

Updated : Dec 26, 2023, 3:11 PM IST

Nara lokesh Fire on CM Jagan : పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్​గా మారిందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో (Jagan Mohan Reddy Padayatra) నోటికొచ్చిన హామీలు ఇచ్చాడని, అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడని దుయ్యబట్టారు. 

Asha Workers Protest Against YSRCP Government in AP : అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశ వర్కర్లు, నిరసన చేస్తున్నారని, త్వరలో గ్రామ వాలంటీర్లు సైతం రోడ్లపైకి ఆందోళన చేస్తారని నారా లోకేశ్ తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశ వర్కర్లకు మద్దతు తెలపాలని లోకేశ్ పిలుపునిచ్చారు.

Last Updated : Dec 26, 2023, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.