కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించిన నారా లోకేశ్ - nara brahmani
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2024/640-480-20451807-thumbnail-16x9-nara-lokesh-family-temples-visit-in-mangalagiri.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 5:47 PM IST
Nara Lokesh Family Temples Visit in Mangalagiri: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) కుటుంబ సమేతంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి, తల్లి భువనేశ్వరి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రూ.20 లక్షల విలువైన కిరీటం, ఇతర ఆభరణాలను బహూకరించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పండితులు లోకేశ్ కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి వస్త్రాలను బహుకరించారు.
తర్వాత మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయం ప్రారంభంలో మెట్ల వద్ద పూజలు నిర్వహించారు. 500 మెట్లకు కర్పూరం వెలిగించారు. స్వామివారికి పానకం మొక్కుగా చెల్లించారు. ఆలయ పూజారులు నారా లోకేశ్ కుటుంబ సభ్యులకు పానకాన్ని, స్వామివారి ప్రసాదాన్ని అందించారు. లోకేశ్ వెంట కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.