Nara Lokesh Criticized CM Jagan: పేదలకు సెంటు స్థలం పేరుతో అవినీతికి పాల్పడ్డారు: నారా లోకేశ్ - టీడీపీ నేతలపై నారా లోకేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2023, 9:28 PM IST

Nara Lokesh Criticized CM Jagan: గోదావరి నది నీటిలా ఇక్కడి ప్రజల మనసులూ స్వచ్ఛమైనవి అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేశ్  అన్నారు.  ఏలూరు జిల్లా గణపవరం కూడలిలో యువగళం బహిరంగ సభలో నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడిన లోకేశ్...  తన యువగళం  పాదయాత్రను ఒక్కరోజైనా అడ్డుకునేందుకు వైసీపీ నేతలు  అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తాను పాదయాత్ర చేసే  దారిలో రెచ్చగొట్టేలా... ఫ్లెక్సీలు పెడుతున్నారని మండిపడ్డారు.  మా నాయకుడిని కించపరిచేలా ఫ్లెక్సీలు పెడితే చింపేస్తామని  నారా లోకేశ్  హెచ్చరించారు.  వైసీపీ చేసే  అక్రమాలపై ఫ్లెక్సీలు పెట్టమంటారా.. జగన్‌ అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.  

24 గంటల విద్యుత్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం జగన్‌ది అన్న లోకేశ్.. జగన్ తెచ్చిన కొత్త పథకం.. అంధకార ప్రదేశ్ అంటూ విమర్శలు గుప్పించారు  పోలవరం కుడికాలువ మట్టి తవ్వి అమ్మేస్తున్నారని ఆరోపణలు చేశారు.  ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బు వసూలు చేస్తున్నారని విమర్శించారు. గోదావరి జిల్లా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్న లోకేశ్ ..  ఉంగుటూరు ఎమ్మెల్యేను చూస్తే జాలేస్తుందన్న లోకేశ్.. సొంతూరిలోనే రోడ్లు లేవు, మంచి నీటి సౌకర్యం లేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి  వచ్చాక వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పేదలకు సెంటు స్థలం పేరుతో అవినీతికి పాల్పడ్డారని  నారా లోకేశ్ పేర్కొన్నారు. కొల్లేరులో అక్రమంగా చెరువులు తవ్వి డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు.   

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.