కరవు, జగన్ కవల పిల్లలు - చిన్న కరవే అని సీఎం చెప్పడం మూర్ఖత్వం : లోకేశ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 17, 2023, 7:31 PM IST

Nara Lokesh Comments On CM Jagan: రాష్ట్రంలోని 400 మండలాల్లో కరవు వల్ల  రైతుల గుండెలు ఎండిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ అన్నారు. ఎద్దు ఏడ్చిన చోట వ్యవసాయం నిలువదనీ.. రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలవదని హెచ్చరిస్తూ ట్వీట్ చేశారు. 400 మండలాల్లో కరువు తాండవిస్తుంటే, చిన్న కరువే అంటూ సీఎం జగన్ చెప్పడం మూర్ఖత్వమని మండిపడ్డారు. అన్నదాతల ఆందోళనలు సైకో సర్కారుకు పట్టదని ఆక్షేపించారు. కరవుపై ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. లోకేశ్​ సమాజిక మాధ్యమం ఎక్స్​లో ఈ విధంగా స్పందించారు. కరువు కోరల్లో చిక్కిన అన్నదాతలను ఆదుకునేందుకు సైకో జగన్ సర్కారు.. ఏ ప్రయత్నమూ చేయలేదని అన్నారు. 24 లక్షల ఎకరాల్లో కనీసం విత్తనమే వేయలేదంటే.. వర్షాభావ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం అవుతోందని వివరించారు.  

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి - కరవు రెండు కూడా కవల పిల్లలు లాంటివారని ఇప్పటికే లోకేశ్​ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరిదీ విడదీయలేని బంధమంటూ వ్యంగ్యస్త్రాలు విసిరారు. సీఎం జగన్ ఎక్కడుంటే, కరవు అక్కడ ఉంటుందంటూ దుయ్యబట్టారు. . ‘‘రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన జగన్ పనైపోయిందని.. ఐరన్ లెగ్ జగన్‌ను రాష్ట్రం మొత్తం ద్వేషిస్తోందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.