పునఃప్రారంభమైన 'నిజం గెలవాలి' యాత్ర- ఉత్తరాంధ్ర పర్యటనకు సిద్ధమైన నారా భువనేశ్వరి - నారా భువనేశ్వరి
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-01-2024/640-480-20416608-thumbnail-16x9-nara-bhuvaneshwari-nijam-gelavali-yatra.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 9:17 AM IST
Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్నారు. 'నిజం గెలవాలి' పేరుతో మరోసారి యాత్ర చేపట్టనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు. ఈ నెల 3న విజయనగరం, 4న పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాల్లో భువనేశ్వరి పర్యటిస్తారు.
బుధవారం ఉదయం విజయనగరంలోని 23వ వార్డుకు చెందిన అప్పారావు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శిస్తారు. అనంతరం అక్కడినుంచి ఆమె బొబ్బిలి చేరుకుంటారు. అక్కడి నుంచి తెర్లాం మండలం పెరుమాళిలో మైలపల్లి పోలయ్య, మోదుగులవలసలో గులిపల్లి అప్పారావు కుటుంబాలను ఓదారుస్తారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేయనున్నారు. గతేడాది అక్టోబర్‌లో "నిజం గెలవాలి" కార్యక్రమాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి ప్రారంభించిన భువనేశ్వరి చంద్రబాబు బెయిల్(Chandrababu bail) పై విడుదలయ్యాక తాత్కాలికంగా విరామం ప్రకటించారు.