ఎన్టీఆర్ ఆరోగ్య రథంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు: నందమూరి వసుంధర - నందమూరి వసుంధర
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 27, 2023, 10:06 PM IST
Nandamuri Balakrishna Wife Vasundhara About NTR Arogya Ratham: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఆకాంక్షతో నందమూరి బాలకృష్ణ.. ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ప్రారంభించారని ఆయన సతీమణి వసుంధర తెలిపారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని ఆమె పరిశీలించారు. ఆరోగ్య రథం ద్వారా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
నెలకు సుమారు 20 లక్షల సొంత ఖర్చులతో రథాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. త్వరలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఆరోగ్య రథం లోపలికి వెళ్లి వైద్యులు, సిబ్బందితో.. వైద్య సేవలపై ఆరా తీశారు. హిందూపురం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథం ప్రారంభించిన.. 15 నెలల కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా కొన్ని వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించగలిగామని తెలిపారు.
ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో బాలకృష్ణ అడుగులు వేస్తున్నారని.. త్వరలోనే కార్పొరేట్ స్థాయిని మించి వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్థానికులతో కాసేపు ముచ్చటించిన అనంతరం.. ఆరోగ్య రథంలోని సిబ్బందితో బీపీ చెక్ చేయించుకుని తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.