వైనాట్ అనడం వైసీపీ నియంత్రత్వ ధోరణికి నిదర్శనం - రాజకీయ పదవులపై వ్యామోహం లేదు: నాగబాబు - నెల్లూరులో జనసేన సమావేశం
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 17, 2023, 7:34 PM IST
Nagababu Comments on YSRCP: వై నాట్ 175 అని వైసీపీ అనడం నియంత్రత్వ ధోరణికి నిదర్శనమని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు. అన్ని నియోజకవర్గాల జనసేన నాయకులతో నెల్లూరులో నిర్వహించిన సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ ధోరణి ఉండకూడదని నాగబాబు అన్నారు. ప్రజా సమస్యలపై గళం వినిపించేందుకు ఖచ్చితంగా ప్రతిపక్షం ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలన్నది, తన సొంత అభిప్రాయమని వెల్లడించారు. అయితే దీనిపై త్వరలోనే స్పష్టత రానుందని చెప్పారు.
ఫిలింనగర్లో ఉన్న తన ఓటును మంగళగిరికి బదిలీ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు నాగబాబు తెలిపారు. అయితే దీనిని కొందరు వివాదాస్పదం చేయడం మంచిది కాదన్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదని స్పష్టం చేశారు. ఓటు బదిలీకి ధరఖాస్తు చేసుకోగా బూత్ లెవల్లో రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాణి అక్రమాలపై పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ పదవులపై తనకు వ్యామోహం లేదని, పార్టీ కోసమే తాను పని చేస్తున్నట్లు వెల్లడించారు.