Nagababu Meeting with Janasena Leaders నెల్లూరు జిల్లా నేతలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు.. రెండు రోజులపాటు సమావేశాలు - నెల్లూరు జిల్లా లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 5:36 PM IST
Nagababu Meeting with Janasena Leaders: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు రేపటి నుంచి రెండు రోజులపాటు (అక్టోబర్ 8,9వ తేదిల్లో) నెల్లూరు జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆదివారం నెల్లూరు చేరుకోనున్న నాగబాబు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తారని జనసేన నేత సుజయ్ బాబు తెలిపారు. నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ భవనంలో జరిగే ఈ సమావేశాలకు జనసేన కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
"ఈ నెల 8,9 తేదీల్లో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు.. నెల్లూరు జిల్లాలో రెండు రోజులపాటు పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఆదివారం నెల్లూరు చేరుకోనున్న నాగబాబు నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై నాయకులు, కార్యకర్తలతో సమీక్షిస్తారు. నగరంలోని రవీంద్రనాథ్ ఠాగూర్ భవనంలో జరిగే ఈ సమావేశాలకు జనసేన కార్యకర్తలందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను." - సుజయ్ బాబు, జనసేన నేత