వైసీపీ పాలనలో అన్ని వర్గాలు మోసపోయాయి- టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోతో వస్తాం: నాదెండ్ల - Janasena
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 9, 2023, 1:21 PM IST
Nadendla Manohar Meeting With Janasena Leaders: వైసీపీ పాలన అంతా ప్రజలను మోసం చేయడంతోనే కాలక్షేపం చేసిందని అన్ని వర్గాలూ వైసీపీ హయాంలో మోసపోయాయని ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు వేచి చూస్తున్నారనీ జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణాలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య సుమారుగా 18% ఓట్ల తేడా ఉంది. కానీ ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో ఏకంగా 18 శాతం ఓట్లను అధిగమించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనీ వివరించారు.
ఎన్నికల నిర్వహణ, ప్రత్యర్థిని ఎదుర్కోవడం, భారీ స్థాయి ఓటింగ్ శాతాన్ని తమ వైపు తిప్పుకొని విజయం సాధించడం చాలా ఆరుదైనా నేటి రాజకీయ పరిస్థితుల్లో అది చాలా సులభంగా మారిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాడా ఇదే జరగబోతోందని చెప్పారు. జనసేన విశాఖపట్నం నగరం, విశాఖపట్నం రూరల్ నియోజక వర్గాల నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో మనోహర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ సిటీ, విశాఖపట్నం రూరల్ నియోజక వర్గాల్లోని పార్టీ పరిస్థితిని స్వయంగా కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.