Nadendla Manohar Challenged Minister Botsa Satyanarayana: "టోఫెల్ అక్రమాలపై మంత్రి బొత్సతో బహిరంగ చర్చకు సిద్ధం" - ఏపీ టోఫెల్ అక్రమాలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 9:06 PM IST

Nadendla Manohar Challenged Minister Botsa Satyanarayana: టోఫెల్​లో జరిగిన అక్రమాలపై జనసేన పీఏసీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్​ స్పందించారు. టోఫెల్​లోని అక్రమాలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో బహిరంగ చర్చకు సిద్ధమని మనోహర్​ సవాల్​ విసిరారు. మూడో తరగతి చదివే పిల్లలకు టోఫెల్‌ పరిక్ష ఎందుకో చెప్పాలని నిలదీశారు. డిగ్రీ మూడో సంవత్సరం చదివే విద్యార్థులు విదేశాలకు వెళ్లటానికి టోఫెల్​కు సిద్ధమవుతారని.. అలాంటిది మూడో తరగతి చదివే విద్యార్థులకు టోఫెల్​ ఎందుకని మనోహర్​ నిలదీశారు. ఈటీసీ సంస్థతో అవగాహన చేసుకునే ముందు అసలు ఒప్పందాలు మంత్రి చదివారా అని ప్రశ్నించారు. ప్రశ్నాపత్రం కోసం ప్రత్యేకమైన కాగితం, ఫలానా ప్రింటర్ పైనే ముద్రించాలని ఉందని.. ఈ ఒప్పందాలు చూస్తే అసలు ఇందులో ఏదో తెలియని రహస్యం ఉందన్నారు. అవగాహన చేసుకునే ముందు ఒప్పందాలన్నీ మంత్రి చదివారా.. లేక సీఎం చెప్పినట్లు చేశారా అని మనోహర్​ సందేహం వ్యక్తం చేశారు. 

టోఫెల్​పై మంత్రి బొత్స ఏమన్నారంటే.. టోఫెల్​కు ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసన్నారు. సెలబ్రిటీ పార్టీగా ఉన్న ఓ రాజకీయ పార్టీ చేస్తున్న ఆరోపణలు సరికాదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రైమరీ స్థాయిలో 6.30 లక్షల మందికి, జూనియర్ స్థాయిలో 14 లక్షల మందికి పరీక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఒక్కో పరీక్షకు ఒక్కొక్కరికి 7 రూపాయల చొప్పున చెల్లించాలని ఒప్పందం కుదిరిందన్నారు. ఆఖరున జరిగే పరీక్షకు 600 రూపాయలు ఉంటుంది. సాలీనా 80 వేల మందికి ఈ తుది పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. 20 లక్షల మంది విద్యార్థులకు ఏటా 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. మాట్లాడే పరీక్షకు 2500 రూపాయల వ్యయం అవుతుందన్నారు. 2027 వరకూ అయ్యే ఖర్చు 145 కోట్లు అని బొత్స తెలిపారు. అప్పటి వరకూ తమ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంచాలని ప్రయత్నం చేస్తే అడ్డుపుల్ల వేస్తున్నారని విమర్శించారు. పాఠశాలలలో బిగిస్తున్న ఐఎఫ్​పీ ప్యానల్ ఒక్కొక్కటి బేరమాడి 1.25 లక్షల చొప్పున కొన్నామన్నారు. కొందరు నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.