రుణాల దుర్వినియోగం - జగన్ నిర్లక్ష్యంతో ఏపీని బ్లాక్ లిస్టులో పెట్టిన బ్యాంకులు : నాదెండ్ల - Jagan loans from national banks
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 4:32 PM IST
Nadendla Manohar Allegations on Jagan About Roads: జగన్ ప్రభుత్వం చేతగాని తనం వల్లే జాతీయ బ్యాంకులు రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం పేరుతో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ల వద్ద తీసుకున్న రుణాలను దుర్వినియోగం చేసి సకాలంలో చెల్లించకపోవడం వల్ల ఆ బ్యాంకులు రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెట్టాయని మనోహర్ వివరించారు.
ఈ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలను చెల్లించాలని కేంద్రం ఎన్నిసార్లు హెచ్చరించినా సీఎం జగన్ పెడచెవిన పెట్టారని అన్నారు. ఈ బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలకు సంబంధించిన వివరాలు వెల్లడించక పోవడంతో ఈ ప్రాజెక్టుల నుంచి తప్పుకొని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాయని అన్నాకు. రాష్ట్ర పరువును ముఖ్యమంత్రి జగన్ అంతర్జాతీయ స్థాయిలో తీసేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్స్ వేసుకునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.