డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికుల ధర్నా - Municipal workers strike
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 28, 2023, 1:39 PM IST
Municipal Workers Strike: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. నెల్లూరు బారాషాహీద్ దర్గా నుంచి ప్రదర్శన నిర్వహించిన కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని మున్సిపల్ కార్మికులు విమర్శించారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, కనీస వేతనాలు అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పురపాలక సంఘం కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. జీతాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేశారు. కార్మికుల సమ్మెతో పురపాలికలో చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చెత్తను తొలగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రైవేటు కార్మికులను రంగంలోకి దించారు. నులకపేట వద్ద వీరిని పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్నారు. నెల్లూరులో బారాషాహీద్ దర్గా నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ తీశారు. తర్వాత ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.