Janasena MPTC protest జనసేనాను గెలిపిస్తే.. మేమెందుకు రోడ్డు వేస్తాం! వైసీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర నిరసన - వైఎస్సార్సీపీ
🎬 Watch Now: Feature Video
MPTC protested roads condition: రహదారుల దుస్థితిపై తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఒక ప్రజాప్రతినిధి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని నిడదవోలు మండలం పెండ్యాల గ్రామం ఎంపీటీసీ సభ్యుడు వాకా శ్రీను.. రహదారుల దుస్థితిని తెలియజేస్తూ.. వర్షపు నీటితో నిండిన రహదారి గోతిలో కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ తరఫున ఆయన ఎంపీటీసీగా గెలుపొందారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వాకా శ్రీను మాట్లాడుతూ పెండ్యాల-కోరుపల్లి రహదారి అధ్వానంగా మారినప్పటికీ నిడదవోలు సభ్యులు పట్టించుకోకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజూ పాఠశాల బస్సులతోపాటు, గర్భిణిలు, ప్రజలు సైతం అధిక సంఖ్యలో ఈ రహదారిలో పయనిస్తూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామంలో అధికార వైఎస్సార్ పార్టీకి చెందిన నాయకుల దృష్టికి రహదారుల దుస్థితిని తీసుకు వెళ్లినపుడు జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన నిన్ను గెలిపించినప్పుడు రహదారులు ఎలా పోస్తారని చెప్పారన్నారు. గత పది సంవత్సరాల కాలంలో తాను గెలిచిన ఎన్నికల్లో తప్ప... మిగిలిన అన్ని ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే పట్టం కట్టారని గుర్తు చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణాన్ని చేపట్టాలని శాసనసభ్యులకు విజ్ఞప్తి చేశారు.