MP RRR Comments శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్గా మారడం వెనుక.. వివేకా హత్య కేసు కోణం: ఎంపీ రఘురామ - మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు
🎬 Watch Now: Feature Video

MP RRR on Sharath Chandra Reddy Approve: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా కొత్త ఎత్తులు పన్నుతున్నారని నరసాపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఆరోపించారు. అందుకే దిల్లీ మద్యం కేసులో శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారని ఆరోపించారు. దిల్లీ మద్యం కుంభకోణంలో కొందరు కీలక వ్యక్తుల పాత్ర గురించి చెప్పడానికే శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తోందన్నారు. ఈ పరిణామాల ఆధారంగా తెలంగాణ సీఎంను ఏపీ సీఎం మోసం చేస్తున్నట్లు స్పష్టమవుతోందని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి పత్రికలో కథనాన్ని రాశారన్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్ట్ అయి, బెయిల్ పొందిన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారారని.. ఆయన జగన్‌కు అత్యంత సన్నిహితుడని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి అల్లుడికి అన్న అని తెలిపారు. అలాంటి శరత్ అప్రూవర్గా మారబోతున్నారని.. రెండు రోజుల క్రితమే జగన్ సొంత పత్రికలో వార్త వచ్చిందన్నారు. అదే నిజమైందని.. మరి అది నిజమైనప్పుడు, శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లను చెబితే వివేక హత్య కేసులోని కుట్ర కోణం నుంచి కీలక వ్యక్తి పేరు రాకుండా చేస్తామని చెప్పినట్లుగా వచ్చిన వార్తా కథనాలను కూడా నమ్మాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.