RRR on Volunteer System: 'వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున డబ్బులు పంచడానికే గ్రామ వాలంటీర్లు' - ap news
🎬 Watch Now: Feature Video

MP Raghu Ramakrishna Raju Comments on Volunteer System : బటన్లు నొక్కుతున్నానని చెప్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పింఛన్లను వాలంటీర్ల ద్వారా ఎందుకు పంచుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఎన్నికల కోసమే వాలంటీర్ వ్యవస్థను తెచ్చారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున డబ్బులు పంచేదీ వాళ్లేనని ఆరోపించారు. బుధవారం 'నాడు రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా దిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను ఆయన ఎత్తిచూపారు. ఈ వ్యవస్థ వల్ల న్యూసెన్స్ తప్పితే మరొకటి లేదని.. ప్రజల్లో తిరుగుబాటు రావాలి ఆయన పిలుపునిచ్చారు. వృద్ధాప్య పింఛన్లు అందజేయడానికి వాలంటీర్ వ్యవస్థ ఎందుకని, వృద్ధులకు బ్యాంకు ఖాతాలలో నేరుగా పెన్షన్ మొత్తాన్ని జమ చేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు. వాలంటీర్లు రేషన్ బియ్యం ఇచ్చినప్పుడే తీసుకోవాలని, లేకపోతే 10 కిలోల రేషన్ బియ్యాన్ని వాలంటీర్లే ఉంచేసుకుంటారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు తీరిక దొరికినపుడు తెచ్చుకునే వెసులుబాటు ఉండేదని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రఘురామకృష్ణ రాజు స్పష్టం చేశారు.