సంక్రాంతికి ఊరు వెళ్లేందుకు రక్షణ కల్పించండి: ఎంపీ రఘురామకృష్ణరాజు - ఆర్ఆర్ఆర్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 8:35 PM IST
MP Raghu Ramakrishna Raju approaches HC: సంక్రాంతికి తన స్వంత గ్రామానికి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు రఘురామపై 11కేసులు పెట్టారని, మరో కేసు పెట్టే అవకాశం ఉందని ఆయన తరపున న్యాయవాదులు ఉమేష్ చంద్ర, వై.వి. రవిప్రసాద్‌లు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీఐడీ అధికారులు అరెస్టు చేసి, రఘురామరాజును చిత్ర హింసలకు గురి చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని కోర్టులో వాదించారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిబంధనలు పాటించాలని ఆదేశాలు ఇవ్వాలని రఘురామ తరపు న్యాయావాదులు కోర్టును అభ్యర్దించారు. ఈ సందర్భంగా అర్నేష్ కుమార్ కేసులో 41ఎ నిబంధనలను పాటించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. కేసు నమోదై, అది ఏడు సంవత్సరాల లోపు శిక్ష ఉన్న సెక్షన్లు అయితేనే 41ఎ నిబంధనలు వర్తిసాయని పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజుపై తాజాగా ఎటువంటి కేసులు పెట్టలేదని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం శుక్రవారం ఉత్తర్వులు ఇస్తామని కోర్టు వెల్లడించింది.