MP Committee visit Simhadri Temple: సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న పార్లమెంట్ కమిటీ సభ్యులు.. - ap latest news
🎬 Watch Now: Feature Video
MP Committee visit Simhadri Temple : విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని పార్లమెంట్ కమిటీ సభ్యులు రామ్ చంద్ర జంగ్రా, ఈరన్న కడాడి, సుజీత్ కుమార్ దర్శించుకున్నారు. సింహాచలంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం మంగళవారం పార్లమెంట్ కమిటీ సభ్యులు, వారి కుటుంబ సభ్యులతో పర్యటించారు. పార్లమెంట్ కమిటీ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకలశంతో వారికి స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాలు నడుమ కప్ప స్తంభాన్ని అలింగనం చేసుకొని బేడా మండపం వద్ద ప్రదక్షిణ చేశారు. అనంతరం వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు.. పార్లమెంట్ కమిటీ సభ్యులకి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం పండితులు స్వామివారి చిత్రపటం, ప్రసాదం వారికి అందించారు.
పార్లమెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నరసింహ స్వామి దేవాలయం హిందూ సంప్రదాయం ఉట్టి పడేలా శిల్పకళాలు, ఆలయపూజా విధానం ఎంతో ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖపట్నం చల్లని వాతావరణమని.. ఆలయ ప్రాంగణం చాలా ఆహ్లాదకరంగా ఉందని పార్లమెంట్ కమిటీ సభ్యులు అన్నారు.