Complaint against DEO: కడప డీఈవోపై కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు.. ఎందుకంటే..!
🎬 Watch Now: Feature Video
MLC Ramgopal Reddy complaint against DEO: వైఎస్ఆర్ కడప జిల్లా విద్యాశాఖాధికారి రాఘవరెడ్డి ఉపాధ్యాయులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ.. అపరిమిత అధికారాలను చెలాయిస్తున్నారని టీడీపీకి చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ఈమేరకు డీఈవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కడప కలెక్టరేట్లోని స్పందనలో కలెక్టర్ విజయ రామరాజుకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు. ఇటీవలే డీఈవో రాఘవరెడ్డి ప్రభుత్వ అనుమతి లేకుండా.. తన విచక్షణాధికారంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ధర్నాలు చేయకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. విద్యాశాఖ అధికారుల సమావేశాల్లో కూడా మహిళా ఉపాధ్యాయునిల పట్ల అనుచితంగా మాట్లాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని రాంగోపాల్ రెడ్డి అన్నారు.
అధికార పార్టీ అండతో.. డీఈవో రాఘవరెడ్డి అధికార పార్టీ అండ చూసుకుని రెచ్చి పోతున్నారని.. జగన్ పాదయాత్రకు తాను 50 లక్షల రూపాయలు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఇలాంటి అధికారి కడప జిల్లాలో పని చేయడం తగదని.. పద్ధతి మార్చుకోక పోతే డీఈవో కార్యాలయం ఎదుట దీక్ష చేపడతానని ఎమ్మెల్సీ హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్.. డీఈవో అంశంపై విచారణకు మహిళా అధికారిణి నియమించినట్లు తెలిపారు.
TAGGED:
కడప వార్తలు