MLC Paruchuri Ashok on Registration Process: రిజిస్ట్రేషన్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నీరు గార్చింది: ఎమ్మెల్సీ అశోక్ బాబు - MLC Paruchuri Ashok comments on Jagan

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 28, 2023, 6:08 PM IST

MLC Paruchuri Ashok on Registration Process: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించిన ప్రభుత్వం, పారదర్శకంగా, పకడ్బందీగా జరగాల్సిన పనిని అపహాస్యంగా మార్చిందని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. ఏప్రిల్ 1వ తేది 2022 నుంచి రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల్లో జరుగుతాయన్న ప్రభుత్వం నిర్ణయం మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే నీరుగార్చిందని మండిపడ్డారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజలకు అనేక సందేహాలున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ తంతు పూర్తయ్యాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ క్రయవిక్రయదారులకు ఎందుకు ఇవ్వడంలేదో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వకుండా తూతూమంత్రంగా చేసే రిజిస్ట్రేషన్లతో తమకు ఏం ఉపయోగం అని కొనుగోలు, అమ్మకం దారులు ప్రశ్నిస్తున్నారని అశోక్‌ బాబు నిలదీశారు. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ విధానంపై ఇప్పటికే హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు పడ్డాయన్న అశోక్ బాబు వాటిపై వాదనలు ప్రారంభమయ్యాక.. ఈ ప్రభుత్వం తన నిర్ణయానికి ఎంతవరకు కట్టుబడుతుందో చూస్తామన్నారు. రికార్డు అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రిజిస్ట్రేషన్ల బాధ్యత అప్పగించడం ఎంతమాత్రం సరైన విధానం కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల అమలుకి అడ్డగోలుగా ఐఆర్ఎస్ స్థాయి అధికారుల్ని నియమిస్తున్నారని ఆక్షస్త్రపించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.