MLC Anantababu Driver Murder Case: అనంతబాబుపై న్యాయపోరాటం కొనసాగిస్తాం..: డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు - Amalapuram latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 22, 2023, 7:46 PM IST
MLC Anantababu Driver Subrahmanyam Murder Case : తమకు న్యాయం జరిగేంత వరకు ఎంత దూరమైనా ప్రయాణించి ఎమ్మెల్సీ అనంత బాబుపై న్యాయపోరాటం చేస్తామని.. హత్యకు గురైన ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకరత్నం, సత్యనారాయణ అన్నారు. దళితులపై దాడులు అత్యాచారాలను ఖండిస్తూ... సీపీఐ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా అమలాపురం రూరల్ మండలం పేరూరులోని కల్యాణమండపంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన దంపతులు ఈ విషయాన్ని వెల్లడించారు. తమకు జరిగిన అన్యాయాన్ని సమావేశంలో విన్నవించారు.
"అనంతబాబు నా కొడుకును చంపేసి తీసుకొచ్చాడు.. చంపేశానని ఒప్పుకున్నా ప్రభుత్వం ఇంకా స్పందించడం లేదు. మేం ఏం అన్యాయం చేశాం.. నా కొడుకును అతి చిన్న వయసులోనే చంపేశారు. నా కోసం.. న్యాయం కోసం మాతో కలిసి పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాం. లాయర్ మా దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు. నాయకులంతా చాలా సహకరిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్తాం" -నూకరత్నం, సుబ్రహ్మణ్యం తల్లి