MLA Perni Nani on Retirement: 'హా..అందుకే రిటైర్ అవుతున్నా..!' పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు - Foundation Stone for Bandaru Port news
🎬 Watch Now: Feature Video

MLA perni nani: మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారా..? సాక్ష్యాత్తూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన చేసిన వ్యాఖ్యల ఆధారంగా చూస్తే అదే నిజమని అనిపిస్తోంది. కృష్ణా జిల్లాలోని బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొనగా.. ఆ సభలో ఎమ్మెల్యే పేర్ని నాని రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఆ సభలో పాల్గొన్న పేర్ని నాని.. బందర్లో మెడికల్ కళాశాల వస్తుందని ఎవరూ ఊహించలేదని, 2021లో దాన్ని మంజూరు చేయటమే కాకుండా 2023లో పూర్తి స్థాయిలో కళాశాల ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. 550 కోట్ల రూపాయలతో సుమారు 64 ఎకరాల్లో మెడికల్ కళాశాలను మంజూరు చేశారని.. ఇందంతా ఓ కలలా ఉందని చెప్పారు. మచిలీపట్నానికి పోర్టు, వైద్య కళాశాలను మంజూరు చేసి.. కృష్ణా జిల్లాకు సీఎం జగన్ పూర్వ వైభవం తీసుకుని వచ్చారని ఆయన అన్నారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యానిస్తుండగా.. సభకు వచ్చిన వారిలో మరో వ్యక్తి ఏదో అనడంతో వేదికపైన ఉన్న పేర్ని నాని కాస్త వ్యంగ్యంగా స్పందిస్తూ.. 'హా.. అందుకే రిటైర్ అయిపోతున్నాను' అని సమాధానమిచ్చారు.