MLA Responded: కృష్ణా జిల్లా మొవ్వ - కూచిపూడి రహదారి.. స్పందించిన ఎమ్మెల్యే, అధికారులు - MLA Responded
🎬 Watch Now: Feature Video

MLA and Officials Responded on News: కృష్ణా జిల్లాలోని మొవ్వ-కూచిపూడి ప్రధాన రహదారి దుస్థితిపై ఈటీవీ, ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, ఆర్ అండ్ బీ ఈ ఈ శ్రీనివాస్‌తో కలిసి రహదారిని పరిశీలించారు. అయ్యంకి నుంచి మొవ్వ కోర్టు వరకు పూర్తిగా ధ్వంసమైన రహదారి నిర్మాణానికి 12 కోట్ల 30 లక్షలతో త్వరలో టెండర్లు పిలవనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ లోపు వాహనదారులు ఇబ్బందులు పడకుండా.. 20 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.
అసలేం జరిగిందంటే.. జిల్లాలోని మొవ్వ నుంచి కూచిపూడి వెళ్లే ప్రధాన రహదారి ధ్వంసమై రోడ్డుపై పూర్తిగా గుంతలు ఏర్పడ్డాయి. ఈ గుంతల్లో వర్షపునీరు చేరి చెరువుల్లా మారాయి. దీంతో అటువైపు వెళ్లాలి అంటేనే వాహనాదారులు జంకుతున్నారు. దీనికి తోడు వర్షపు నీరు చేరటంతో ఈ గుంతలు మరింతా ఇబ్బందిగా మారినట్లు ప్రయాణికులు వాపోయారు. ఇదే విషయాన్ని ఈటీవీ, ఈ టీవీ భారత్ వెలుగులోకి తీసుకువచ్చింది.