Minister Jogi Ramesh on CM Jagan Cases: 16 నెలలు జైల్లో ఉండి జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు: మంత్రి జోగి రమేష్ - ysrcp leader jogi ramesh comments on chandrababu
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 15, 2023, 2:51 PM IST
Minister Jogi Ramesh on CM Jagan Cases: సీఎం జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టినా.. 16 నెలలు జైల్లో ఉండి ధైర్యంగా ఎదుర్కొన్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. అదే విధంగా టీడీపీ, జనసేన పొత్తుపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. 2014 నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిసి ఉంటున్నారని అన్నారు. వారిద్దరిది ఫెవికాల్ సంబంధమని పేర్కొన్నారు. ఈ విషయంలో కొత్తగా ఏమీ లేదని అన్నారు. జనసేన, టీడీపీ కలిసే ఉన్నాయని.. పైకి మాత్రం నటిస్తూ ఉంటారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తాడని ప్రపంచ పటంలో నిలుపుతారనుకుంటే.. పూర్తిగా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబు నాయుడు అంత అవినీతిపరులు దేశంలో రాష్ట్రంలో ఎక్కడా లేరని విమర్శించారు. అధికారం అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. హవాలా మార్గంలో సూట్ కేసులు ద్వారా దోపిడీ చేశారన్నారు. కేంద్ర పెద్దల కాళ్లు పట్టుకోవడానికి నారా లోకేశ్ దిల్లీకి పోయారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేయటం వల్లే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊసలు లెక్కబెడుతున్నారని ఆరోపించారు.