Minister Jogi Ramesh మంత్రి జోగి రమేష్​కు నిరసన సెగ.. ఇళ్లపట్టాల అవకతవకలపై అడ్డగించిన మహిళలు...

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 20, 2023, 8:33 PM IST

  పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు  కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్​ వచ్చారు. మంత్రి జోగి రమేష్​కు స్థానిక ప్రజల  నుంచి నిరసన సెగ తగిలింది. ఆకివీడు మండలం కుప్పనపూడిలో పర్యటించిన మంత్రి జోగి రమేష్.. గ్రామ పరిధిలోని తాళ్లకోడు ప్రాంతంలో ఉన్న 74 ఎకరాల లేఅవుట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా లేఔట్ ప్రాంతంలో తాగునీరు, రహదారులు లేక అవస్థలు పడుతున్నామని లబ్దిదారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కోళ్లపర్రు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన మంత్రినితో  ఇళ్ల స్థలాలు పంపిణీ సక్రమంగా జరగలేదని గ్రామస్థులు విన్నవించుకున్నారు. వీఆర్వో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అనర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని మంత్రికి తెలిపారు. అనంతరం మండలంలోని పెదకాపవరంలో రహదారుల నిర్మాణానికి శంకుస్థాపనకు వచ్చిన మంత్రి జోగి రమేష్ సభలో మాట్లాడుతుండగా అడ్డుకున్న గ్రామస్థులు తమ నిరసన తెలిపారు. తమకు ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని మంత్రికి తెలియజేశారు. ఆయన సమస్య పరిష్కరించమని ఎమ్మార్వోకి సూచించి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  పలువురు గ్రామస్థులు మంత్రి కారు వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించారు. సమస్యలు పూర్తిగా వినకుండానే మంత్రి వెళ్లిపోవడంతో, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.