Minister Botsa comments: లాభాలొస్తే ప్రభుత్వానికి ఇస్తున్నారా..? బ్లాక్ మెయిల్ చెేయొద్దు: బొత్స - సహకార రంగంలోని చక్కెర పరిశ్రమల ప్రైవేటీకరణ
🎬 Watch Now: Feature Video
Botsa comments on Ferro alloys industries: ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలన్నది ఫెర్రో యాజమాన్యాల ఉద్దేశ్యం.. విద్యుత్తు టారిఫ్ పెరిగిందని ఫెర్రో ఎల్లాయ్స్ యాజమాన్యాలు అంటున్నాయి. వారికి లాభాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చారా..? వ్యాపారంలో హెచ్చుతగ్గులను తట్టుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లా జడ్పీ సమావేశానికి మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకుంది. విద్యుత్తు టారిఫ్ పెరిగిందని ఫెర్రో ఎల్లాయ్స్ యాజమాన్యాలు అంటున్నాయి. వారికి లాభాలు వచ్చినప్పుడు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చారా..? అని మంత్రి ఈ సందర్భంగా ప్రశ్నించారు. వ్యాపారాల నిర్వహణలో ఒడిదుడుకులు వస్తుంటాయని వాటిని తట్టుకొని నిలబడాలని,.. నష్టాలు వచ్చినంత మాత్రాన వాటిని మూసివేయడం సరికాదన్నారు. గతంలో పొందిన లాభాల నుంచి నష్టాలను పూడ్చుకొని పరిశ్రమల నిర్వహణను కొనసాగించాలన్నారు. ఏదైనా ఉంటే ప్రభుత్వం చూస్తుంది కదా.. అని అన్నారు.
ప్రభుత్వానికి ఓ పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాం. అల్టిమెట్గా ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయాలన్నది ఫెర్రో యాజమాన్యాల ఉద్దేశ్యంగా ఉందన్నారు. కార్మికుల ఉపాధి విషయానికొస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. వారి ప్రత్యామ్నాయం చూపుతాం. ఫెర్రో పరిశ్రమల మేనేజ్మెంట్లకు విజ్ఞప్తి చేస్తున్నా.., వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఓపిక పట్టాలి. అయినప్పటికీ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. తొందపడి పరిశ్రమలను లాకౌట్ చేయకండని మంత్రి ఈ సందర్భంగా కోరారు. రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర పరిశ్రమల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోందా..? అన్న ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ రైతులు లక్ష్యం మేరకు చెరకు పండిస్తే చక్కెర పరిశ్రమలు నడిపేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. విజయనగరం జిల్లాలోని భీమసింగ్ చక్కెర కర్మాగారాన్ని మూసివేసినప్పటికీ ఆ ప్రాంత చెరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధే ధ్యేయంగా ప్రజల ఆశీస్సులతో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.