villagers stopped Minister: 'ఏం చేశారని ఇంటింటికీ వస్తున్నారు..?' మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు నిరసన సెగ - గడపగడపకు మన ప్రభుత్వంల
🎬 Watch Now: Feature Video
villagers stopped the minister Suresh: నాలుగేళ్లుగా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన నిలిచిపోగా.. వచ్చిన ప్రతిసారి నాయకులు ఇస్తున్న హామీలు అమలు కాకపోవడంతో గ్రామాల్లో ప్రజలు రగిలిపోతున్నారు. నాయకులపై తిరగబడుతున్నారు. ఏం ఒరగబెట్టారని మళ్లీ వచ్చారు అంటూ ముఖం మీదే నిలదీస్తున్నారు. ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వంలో నిరసన వెల్లువెత్తుతుండడం విదితమే. తాజాగా.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు నిరసన సెగ తగిలింది. పెద్దారవీడు మండలం గొబ్బురు గ్రామంలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ఆయన్ను స్థానికులు అడ్డుకున్నారు. గ్రామంలోకి రాగానే మంత్రిని స్థానికులు చుట్టుముట్టారు. ఏం అభివృద్ధి పనులు చేశారని ఇంటింటికీ వస్తున్నారని పలువురు ప్రశ్నించారు. వర్షం పడితే వీధుల్లో ఉండే పరిస్థితి లేదని మహిళలు వాపోయారు. ఎన్నిసార్లు చెప్పినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు అసహనం వ్యక్తం చేశారు. నిరసన విషయాన్ని ముందస్తుగా గ్రహించిన పోలీసులు.. గ్రామంలోకి చేరుకొని స్థానికులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా కొందరు శాంతించకపోవడంతో తూతూమంత్రంగా కార్యక్రమం ముగించుకుని గ్రామం నుంచి మంత్రి వెళ్లిపోయారు.