తెలంగాణలో ఓట్లు వేసిన వారు ఏపీలోనూ ఓటు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు:మేరుగు నాగార్జున
🎬 Watch Now: Feature Video
Merugu Nagarjuna Met the AP Chief Electoral Officer : తెలంగాణాలో ఓట్లు వేసిన వ్యక్తులు ఏపీలోనూ ఓట్లు వేసేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని మంత్రి మేరుగ నాగార్జున ఆరోపించారు. తెలంగాణలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేయకుండా కలెక్టర్లకు ఆదేశాలివ్వాలని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆయన మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు ఈ రిజిస్ట్రేషన్లను చేయిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
Minister Merugu Nagarjuna Comments on Illegal Votes : అనంతరం మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు (TDP Chief Chandrababu Naidu) వ్యవస్థలు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తుడని, రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టీడీపీ ఇలాంటి కుట్రలు చేస్తోందని విమర్శించారు. భాగ్యనగరంలో ఓటు వేసిన వారు ఏపీలో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ ప్రగతినగర్‌లో బ్యానర్లు కట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నరని తెలిపారు. ఎన్నికల ప్రధానాధికారిని మంత్రి మేరుగు నాగార్జునతో పాటు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కలిశారు.